సమష్టి కృషితో శిశు మరణాల తగ్గింపు
ABN , First Publish Date - 2020-10-03T06:00:35+05:30 IST
శిశు మరణాలను తగ్గించేందుకు సమష్టి కృషి అవసరమని ఏరియా ఆసుపత్రి వైద్యాధికారిణి డాక్టర్ ఎన్.సుదీప్తి అన్నారు. స్థానిక ఏరియా
పెద్దాపురం, అక్టోబరు 2: శిశు మరణాలను తగ్గించేందుకు సమష్టి కృషి అవసరమని ఏరియా ఆసుపత్రి వైద్యాధికారిణి డాక్టర్ ఎన్.సుదీప్తి అన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో మన పెద్దాపురం ఫేస్‌బుక్ ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న కార్యక్రమం విధాత ఊయల (క్రియేటర్ క్రాడిల్) కార్యక్రమంలో ఆమె పాల్గొని శుక్రవారం మాట్లాడారు. ఫేస్‌బుక్ గ్రూప్ అడ్మిన్ పెద్దిరెడ్డి నరేష్ మాట్లాడుతూ ఏటా అప్పుడే పుట్టిన శిశువులు చాలా చోట్ల చెత్తకుప్పల్లో రోడ్ల పక్కన దిక్కులేకుండా కనిపించడం మనం చూస్తుంటామని అటువంటి వారి సంరక్షణకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి వెంకట్, సీడీపీవో పంతం సావిత్రి పాల్గొన్నారు.