రెడ్‌క్రాస్‌ భాగస్వామ్యం కావాలి

ABN , First Publish Date - 2020-12-13T06:27:15+05:30 IST

విశ్వవిద్యాలయ అభివృద్ధిలో రెడ్‌ క్రాస్‌ సేవలతో భాగస్వామ్యం కా వాలని ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాధరావు అన్నారు.

రెడ్‌క్రాస్‌ భాగస్వామ్యం కావాలి


నన్నయ వీసీ జగన్నాథరావు

 దివాన్‌చెరువు, డిసెంబరు 12 : విశ్వవిద్యాలయ అభివృద్ధిలో రెడ్‌ క్రాస్‌ సేవలతో భాగస్వామ్యం కా వాలని ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాధరావు అన్నారు. జిల్లా రెడ్‌ క్రాస్‌ ఛైర్మన్‌ వై.వి.రామారావు నన్నయ వీసీని శనివారం కలిసి రెడ్‌క్రాస్‌ మాస్క్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యా లయం, రెడ్‌క్రాస్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రెడ్‌క్రాస్‌ బస్‌షెల్టర్‌ను త్వరలో పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య బట్టు గంగారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T06:27:15+05:30 IST