ఘనంగా రెడ్‌క్రాస్‌ దినోత్సవం

ABN , First Publish Date - 2020-05-09T07:58:25+05:30 IST

ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవాన్ని జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా రెడ్‌క్రాస్‌ దినోత్సవం

కాకినాడ (భానుగుడి) మే 8: ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవాన్ని జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంస్థ అధ్యక్షుడు, జిల్లా కలెక్టరు డి.మురళీధర్‌రెడ్డి సర్‌ హెన్రీ డ్యూనాంట్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పతాకాన్ని ఆవిష్కరించారు. మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు తలసేమియా వ్యాధిగ్రస్తులకు పండ్లు, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ జిల్లా ఉద్యోగులు సమకూర్చిన రూ.50వేలు విరాళాన్ని కొవిడ్‌ సేవలకు వినియోగించాలని కోరుతూ అందజేశారు. రైల్వే విశ్రాంత ఉద్యోగులు కూడా కొవిడ్‌ సేవలకు రూ.30 వేలు విరాళాన్ని కలెక్టరుకు అందజేశారు. కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్రంలోనే జిల్లా రెడ్‌క్రాస్‌ సంస్థ మొదటి స్థానంలో సేవలందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్‌ వైడీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-09T07:58:25+05:30 IST