రావులపాలెంలో విజిలెన్స దాడులు

ABN , First Publish Date - 2020-11-06T06:22:33+05:30 IST

రావులపాలెంలో విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి రూ.5 లక్షల విలువైన రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు రాజమహేంద్రవరం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, రావులపాలెం రెవెన్యూ, సివిల్‌ సప్లయిస్‌ అధికారులు అక్రమంగా తరలిపోతున్న రేషన్‌బియ్యం పట్టుకున్నారు.

రావులపాలెంలో విజిలెన్స దాడులు
రావులపాడు వద్ద విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం వ్యాన్‌

  • రూ.5 లక్షలు విలువైన రేషన బియ్యం పట్టివేత

రావులపాలెం రూరల్‌, నవంబరు 5: రావులపాలెంలో విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి రూ.5 లక్షల విలువైన రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు రాజమహేంద్రవరం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, రావులపాలెం రెవెన్యూ, సివిల్‌ సప్లయిస్‌ అధికారులు అక్రమంగా తరలిపోతున్న రేషన్‌బియ్యం పట్టుకున్నారు. మండల పరిధిలోని రావులపాడు శ్మశానాల సమీపంలో ఇతర ప్రాంతాల నుంచి మోటారు సైకిలుపై తెస్తున్న రేషన్‌ బియ్యాన్ని కర్రి రామిరెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రావులపాలెం, పరిసర ప్రాంతాల్లోని కొందరు వ్యక్తులు ఇంటింటికీ తిరిగి కిలో రూ.12 చేసి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీనిని రూ.13.50కు కర్రి రామిరెడ్డి అనే వ్యక్తికి విక్రయిస్తున్నారు. ఈయన యానాం తదితర ప్రాంతాలకు చెందిన వారికి రూ.16 చొప్పున విక్రయిస్తున్నారన్నారు. దాడి చేసిన సమయంలో ఐషర్‌ వ్యాన్‌, చెంతనే ఉన్న షెడ్డులో మొత్తం 308 బస్తాలు ఉన్నాయి. వాటి బరువు 13,392 కిలోలు, విలువ రూ.5,08,896. ఐషర్‌వ్యాన్‌, మోటారు సైకిళ్లను సీజ్‌ చేశారు. దాడుల్లో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో పాటు అమలాపురం పౌరసరఫరాల అధికారి ఆనందబాబు, సీఎస్‌డీటీలు బి.స్వామి, టీవీఎస్‌ రమాదేవి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-06T06:22:33+05:30 IST