మహిళపై అత్యాచారం

ABN , First Publish Date - 2020-03-18T09:32:28+05:30 IST

స్వగ్రామం తీసుకెళ్తానని బండి ఎక్కించుకుని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. రంగంపేట మండలంలోని

మహిళపై అత్యాచారం

మహిళాపోలీసు సహాయంతో పోలీసులకు ఫిర్యాదు


రంగంపేట, మార్చి 17: స్వగ్రామం తీసుకెళ్తానని బండి ఎక్కించుకుని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి.  రంగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ(40) ఆరోగ్యం బాగోకపోవడంతో సోమవారం రంగం పేట ప్రాథమిక ఆసుపత్రికి వచ్చింది. చికిత్స చేయించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రంగంపేటకు చెందిన అమలదాసు వీరబాబు(43) ఊరిలో దిగబెడతానని ఆమెను టీవీఎస్‌ మోపెడ్‌పై ఎక్కుంచుకున్నాడు.


మార్గమధ్యంలో ఓ పామా యిల్‌ తోటలోకి ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తోటలో నుంచి రోడ్‌పైకి వచ్చి స్వగ్రామానికి చెందిన ఓ వ్యక్తి కనపడటంతో అతడి బండిపై ఇంటికి చేరింది. అనంతరం మంగళవారం గ్రామ సచివాలయంలో ఉండే మహిళాపోలీసుకు జరిగిన సంఘటనను వివరించింది. ఆమె సహాయంతో బాధిత మహిళ రంగంపేట పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. పెద్దాపురం సీఐ కేఎన్‌వీ జయ కుమార్‌, ఎస్‌ఐ సుధాకర్‌తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితుడు రంగంపేటలో చికెన్‌, పందిమాసం విక్రయిస్తుం టాడని చెప్పారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, గాలింపు చర్యలు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-03-18T09:32:28+05:30 IST