పెరిగిపోతున్న వైసీపీ దౌర్జన్యాలు
ABN , First Publish Date - 2020-12-30T05:41:49+05:30 IST
గంగవరం, డిసెంబరు 29: రంపచోడవరం నియోజకవర్గంలో రోజురోజుకూ వైసీపీ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. మంగళవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 22న జడేరు జంక్షన్‌లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీల

మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
గంగవరం, డిసెంబరు 29: రంపచోడవరం నియోజకవర్గంలో రోజురోజుకూ వైసీపీ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. మంగళవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 22న జడేరు జంక్షన్‌లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు చింపివేశారని, ఈ సంఘటనలో మహిళా నాయకులు, గిరిజనులను కులంపేరుతో దుర్భాషలాడారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై అదేరోజు రాత్రి గంగవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, నేటికీ వైసీపీ నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికే పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, మాజీ ఎంపీటీసీ బుల్లియ్యమ్మ, టీడీపీ నాయకులు పాము అర్జున, కనిగిరి రాంబాబు, బద్రి పాల్గొన్నారు.