బీసీలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు

ABN , First Publish Date - 2020-03-04T09:24:15+05:30 IST

ప్రభుత్వం బీసీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకినాడ

బీసీలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు

టీడీపీ బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామారావు


పెద్దాపురం, మార్చి 3: ప్రభుత్వం బీసీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకినాడ రామారావు ఆరోపించారు. స్థానిక సుధా కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మంగళవారం మాట్లాడారు. జగన్‌కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేయాల న్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించకుండా చూడాలన్నారు.


బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు ముఖ్యమంత్రి జగన్‌కు ఇష్టం లేదని ఆయన విమర్శించారు. టీడీపీకి బీసీలే వెన్నెముక అని తెలిసి వారిపై కక్షగట్టారన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రాతినిధ్యం తగ్గించేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, బీసీలకు అన్యాయం జరిగితే ఎంతమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ రాజాసూరిబాబురాజు, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనే రామారావు, బీసీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు తాళాబత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-04T09:24:15+05:30 IST