రామదండు వచ్చినాదిరో..

ABN , First Publish Date - 2020-12-11T06:07:15+05:30 IST

గోకవరం మండలం అచ్యుతాపురంలో గురువారం కోటి తలంబ్రాల పంటకు వానరసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రామదండు వచ్చినాదిరో..
పొలంలో వేషధారణలు

గోకవరం, డిసెంబరు 10: గోకవరం మండలం అచ్యుతాపురంలో గురువారం కోటి తలంబ్రాల పంటకు వానరసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2021 ఏప్రిల్‌ 21, 26వ తేదీల్లో భద్రాద్రి, ఒంటిమిట్టలో జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలను సేకరించడంలో భాగంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టినట్టు కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు తెలిపారు. ముందుగా కోటి తలంబ్రాల పంటకు పూజ, హారతి నిర్వహించారు. అనంతరం ఆంజనేయ, అంగధుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వేషధారణలతో రామ భక్తులు శ్రీరామ నామ సంకీర్తనలతో వరి పంట కోత ప్రారంభించారు. ఈ పంట ద్వారా సేకరించిన 800 కిలోల ధాన్యాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 8 జిల్లాల్లోని 30 మండలాల్లో ఉన్న 60 గ్రామాల్లో 3000 మందితో గోటితో ఒలిపిస్తామన్నారు. అనంతరం శ్రీసీతారాముల కల్యాణానికి అందించనున్నట్టు అప్పారావు వివరించారు. పదేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్టు అప్పారావు తెలిపారు.

Updated Date - 2020-12-11T06:07:15+05:30 IST