‘రజకుల దోభీఖానా స్థలాన్ని యథావిధిగా ఉంచాలి
ABN , First Publish Date - 2020-10-01T07:20:44+05:30 IST
ఇంద్రపాలెం లాకుల సమీపంలోని చాకిరేవు స్థలాన్ని ప్రభుత్వ నిర్మాణాల పేరిట స్వాధీనం చేసుకోవాలని చూ స్తుండడాన్ని నిరసిస్తూ రజకులు బుధవారం కలెక్టరేట్‌వద్ద
డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), సెప్టెంబరు 30: ఇంద్రపాలెం లాకుల సమీపంలోని చాకిరేవు స్థలాన్ని ప్రభుత్వ నిర్మాణాల పేరిట స్వాధీనం చేసుకోవాలని చూ స్తుండడాన్ని నిరసిస్తూ రజకులు బుధవారం కలెక్టరేట్‌వద్ద ధర్నా నిర్వహించారు.
శ్రీ కనకదుర్గ రజక సంఘం నాయకులు మాట్లాడుతూ ఇటీవల దోభీఖానా స్థలంలో భవనాల నిర్మాణం పేరుతో రెండు బావులు పూడ్చి వేశారన్నారు. దోభీఖానాను యథావిధిగా కొనసాగించి రజక వృత్తిదారులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సంఘం అధ్యక్షుడు బి.సత్యనారాయణరాజు, కార్యదర్శి ఎ.అర్జునరావు, సీహెచ్‌వీ బాలు శ్రీనివాస్ పాల్గొన్నారు.