రామచంద్రపురం కమిషనర్‌పై ఎమ్మెల్యే ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-03-25T10:08:47+05:30 IST

రామచంద్రపురం పారిశుధ్యలోపంపై ఎమ్మెల్యే వేణు మున్సిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావుపై మంగళవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

రామచంద్రపురం కమిషనర్‌పై ఎమ్మెల్యే ఫిర్యాదు

రామచంద్రపురం, మార్చి 24: రామచంద్రపురం పారిశుధ్యలోపంపై ఎమ్మెల్యే వేణు మున్సిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావుపై మంగళవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ముగ్గు, వాటర్‌బాటిల్‌తో డ్రైన్లపై హైపోఫ్లోరైడ్‌ మిశ్రమం పిచికారీ చేశారు. ఈ విషయాన్ని పలువురు ఎమ్మెల్యే వేణు దృష్టికి తీసుకెళ్లారు. పురపాలక సంఘం కార్యాలయానికి చేరుకున్న ఆయన ఆరోగ్యా ధికారిపై మండిపడ్డారు. కమిషనర్‌ తీరుపై కలెక్టర్‌, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్డీ నాగరాజు రామచంద్రపురానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 


Read more