-
-
Home » Andhra Pradesh » East Godavari » QUALITY RULES PATINCHALSINDE
-
నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే: ఐటీడీఏ పీవో
ABN , First Publish Date - 2020-12-19T06:27:13+05:30 IST
నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరిత గతిన పూర్తిచేయాలని రంపచోడవరం ఐటీడీఎ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు.

గంగవరం, డిసెంబరు 18: నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరిత గతిన పూర్తిచేయాలని రంపచోడవరం ఐటీడీఎ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు. మండలంలో పలు శాఖల ద్వారా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అముదాలబంద నుంచి గంగవరం వరకు రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న రహదారి, పెద్ద అడ్డపల్లి నుంచి జీడిపాలెం వరకు రూ.3 కోట్లతో నిర్మిస్తున్న రహదారులను పరిశీలించారు. గంగవరంలో పీహెచ్‌సీ భవన నిర్మాణాన్ని పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. డీఈలు సాయి వెంకటలక్ష్మి, జేఈ లక్ష్మణ్, ఏఈలు ప్రదీప్‌కుమార్, ఆచారి తదితరులు పాల్గొన్నారు.