పుష్కర ఎత్తిపోతల పథకం మెట్ట రైతులకు వరం: డీఈ రాజేంద్రప్రసాద్‌

ABN , First Publish Date - 2020-10-07T09:21:25+05:30 IST

మెట్ట రైతులకు వరం పుష్కర ఎత్తిపోతల పథకం అని పుష్కర ఎత్తిపోతల పథకం డీఈ రాజేంద్రప్రసాద్‌ అన్నారు...

పుష్కర ఎత్తిపోతల పథకం మెట్ట రైతులకు వరం:  డీఈ రాజేంద్రప్రసాద్‌

పెద్దాపురం, అక్టోబరు 6: మెట్ట రైతులకు వరం పుష్కర ఎత్తిపోతల పథకం అని  పుష్కర ఎత్తిపోతల పథకం డీఈ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మండల పరిధిలోని వాలుతిమ్మాపురం, ఆర్‌బీ పట్నం గ్రామాల మధ్యలో ఉన్న పుష్కర ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కాలువలను రైతులతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెట్ట గ్రామాలైన ఆర్‌బీ పట్నం, ఆర్బీ కొత్తూరు, సీబీ దేవం, కొండపల్లి తదితర గ్రామాలకు పుష్కర కాలువలు వరం అన్నారు. పుష్కర  కాలువలద్వారా మెట్ట పంటలకు పుష్కలంగా నీరు అందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుష్కర ఎత్తిపోతల పథకం ఏఈలు కిరణ్‌, హరిణి రైతులు యెండ్రు సత్తిబాబు, యెండ్రు రామారావు, బచ్చల రాజు, కంటిపూడి విష్ణు, చక్రం పాల్గొన్నారు. 

Read more