ప్రజా నాయకుడు జక్కంపూడి
ABN , First Publish Date - 2020-10-10T08:29:26+05:30 IST
ప్రజల కోసం పోరాడే నాయకుడు ఎప్పు డూ ప్రజల గుండెల్లోనే వుంటారని, అటువంటి నేత జక్కంపూడి రామ్మోహనరావు అని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు...
రామ్మోహనరావు వర్ధంతి సభలో మంత్రి తానేటి వనిత
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 9: ప్రజల కోసం పోరాడే నాయకుడు ఎప్పు డూ ప్రజల గుండెల్లోనే వుంటారని, అటువంటి నేత జక్కంపూడి రామ్మోహనరావు అని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం జక్కంపూడి వర్ధంతి సందర్భంగా కంబాలచెరువు సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి వనిత పూలమాల వేసి నివాళులర్పించారు. జక్కంపూడి ఫౌండేషన్ పేరిట ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన తమ్ముడు గణేష్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పలు ప్రాంతాల్లో వున్న జక్కంపూడి విగ్రహాలకు వైసీపీ నాయకులు శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నందెపు శ్రీనివాస్, మేడపాటి షర్మిలారెడ్డి, మాసా రామ్‌జోగ్, మజ్జి అప్పారావు, బొంతా శ్రీహరి, వాసంశెట్టి గంగాధర్, మంచాల బాబ్జీ, నక్కా శ్రీనగష్, ఎండీ కరీంఖాన్ తదితరులు నివా ళులర్పించారు.
రాజమహేంద్రవరం: జక్కంపూడి రామ్మోహనరావు అలు పెరుగని జననేత అని, ప్రజల సమస్యలపై ఆయన నిరంతరం పోరాటం చేశారని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. జక్కంపూడి వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన నివాళులర్పించారు.
కోరుకొండ: జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను శాశ్వత ప్రాతిపదికన చేపడతామని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మండలంలోని గాదరాడలో బత్తుల బలరామకృష్ణ ఏర్పాటుచేసిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహాలను శుక్రవారం సాయంత్రం అనపర్తి, జగ్గంపేట ఎమ్మెల్యేలతో కలిసి రాజా ప్రారంభించారు. జక్కంపూడి వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏడాదికాలంలో కోరుకొండ, సీతానగరం, రాజానగరం, కడియం మండలాల్లో అన్ని సౌకర్యాలతో కూడిన ఐదు బరియల్ గ్రౌండ్సు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, వైసీపీ నాయకులు ఆకుల వీర్రాజు, శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, నందెపు శ్రీనివాస్, జక్కంపూడి గణేష్, యర్రంశెట్టి పోలారావు, అరుగోలి చినబాబు, చిక్కిరెడ్డి సురేష్, అడబాలచినబాబు పాల్గొన్నారు.
దివాన్‌చెరువు: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విశేష కృషి చేసిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు చిరస్మరణీయుడని ఉప కులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు పేర్కొన్నారు. జక్కంపూడి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి వీసీ పూలమాలవేసి నివాళులర్పించారు. రామ్మోహనరావు జ్ఞాపకార్థం విశ్వ విద్యాలయంలో ఒక భవనానికి గానీ, ఒక విభాగానికి గానీ ఆయన పేరు పెడతామని చెప్పారు. కార్యక్రమంలో ఈసీ సభ్యులు ఆచార్య కె.శ్రీరమేష్, ప్రిన్సిపాల్స్ కె.రమణేశ్వరి, కె.సుబ్బారావు, ప్రొఫెసర్ పి.సురేష్‌వర్మ, సహాయాచార్యులు ఎం.గోపాలకృష్ణ తదిత రులు పాల్గొన్నారు. పాలచర్లలో జక్కంపూడి చిత్రపటానికి వైసీపీ నాయకులు గం గిశెట్టి సోమేశ్వరరావు, నాళం రోశయ్య, వేమగిరి కృష్ణ, కొత్తపల్లి అబ్బులు పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం వలంటీర్లుకు, పీహెచ్‌సీ సిబ్బందికి పండ్లు పంపిణీ చే శారు.
రాజానగరం: జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి సందర్భంగా రాజానగరం పీహెచ్‌సీ వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు వైసీపీ నాయకులు డ్రై ఫ్రూట్స్ కిట్లు పంపిణీ చేశారు. కరోనా బాధితులకు విశేష సేవలందించిన పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ టి.రవికుమార్‌ను, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రగడ చక్రిని పూలమాలలతో సత్కరించి, దుశ్శాలువాలు కప్పారు. కార్యక్రమంలో నాయకులు దూలం పెద్ద, కొల్లి వీర్రాజు, ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కడియం: మండంలోని బుర్రిలంకలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి రూరల్ కో-ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, నర్సరీ రైతులు తాడాల చక్రవర్తి, కొత్తపల్లి శివాజీ, ఈలి సత్తిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడియపులంక దోసాలమ్మకాలనీ వద్ద జరిగిన కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు యాదల స్టాలిన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు రావిపాటి రామచంద్రరావు, గిరజాల బాబు, నాయకులు నాగిరెడ్డి శివాజీ, యీలి గోపాలం, సర్కార్ బాషా, నర్సరీరైతులు పాల్గొన్నారు. పల్ల వెంకన్న కుమారులు సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి ఆధ్వర్యం లో కడియపులంక దోసాలమ్మకాలనీ, జాతీయ రహదారి వద్ద జక్కంపూడి విగ్రహాల వద్ద వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు.
సీతానగరం: స్థానిక మదర్ థెరిస్సా సెంటర్లో వైసీపీ మండల కన్వీనర్, ఆత్మ చైర్మన్ డాక్టరు బాబు ఆధ్వర్యంలో జక్కంపూడి వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో చింతలపూడి వీరబాబు, వలవల వలి, వలవల వెంకట్రాజు. సలాది వాసు పాల్గొన్నారు
ధవళేశ్వరం: సాధనాల శివ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ సెంటరు వద్ద జక్కంపూడి రామ్మోహనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీహెచ్‌సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గరగ శ్రీను, శ్రీరంగం బాలరాజు, చొల్లంగి సత్యగిరి, కేతా సాయి, బోడపాటి కుమార్, సరిత చప్పిడి జ్యోతి, జంగా కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
