ప్రజల వెంటే టీడీపీ

ABN , First Publish Date - 2020-12-03T05:44:36+05:30 IST

అధికారంలో ఉన్నా.. లేకున్నా.. టీడీపీ ప్రజల వెంటే ఉంటుందని ఆ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు అన్నారు.

ప్రజల వెంటే టీడీపీ

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 2: అధికారంలో ఉన్నా.. లేకున్నా.. టీడీపీ ప్రజల వెంటే ఉంటుందని ఆ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు అన్నారు. బుధవారం స్థానిక హోటల్‌ జగదీశ్వరిలో సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశం నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి అధ్యక్షతన జరిగింది. దీనికి వారు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా బిల్లుల ఆమోదం కోసం నిర్వహించుకుంటున్నారని విమర్శించారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఎన్నికల్లో జగన్‌ ఇచ్చిన హామీల్లో నవరత్నాలు అని ఇప్పుడు నవరత్న ఆయిల్‌ వాసన చూపిస్తున్నారన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలకు సంబంధించి అర్హులందరికి ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు ఆదేశాల మేరకు టిడ్కో లబ్ధిదారులందరినీ త్వరలో కలిసి జాకెట్‌, పసుసు కుంకుమ అందిస్తామన్నారు. ఈ సందర్భంగా యర్రా వేణుగోపాలరాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, షేక్‌ సుభాన్‌, మాజీ కార్పొరేటర్‌ ఇన్నమూరి రాంబాబు, మజ్జి రాంబాబు మాట్లాడారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కమిటీలో స్థానం  పొందిన నేతలను అప్పారావు  సత్కరించారు. సమావేశంలో మాలే విజయలక్ష్మి, దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్లు కోరుమిల్లి విజయశేఖర్‌, బెజవాడ రాజ్‌కుమార్‌, మర్రి దుర్గాశ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:44:36+05:30 IST