అమలు కాని కలెక్టర్ ఆదేశాలు: వర్మ
ABN , First Publish Date - 2020-12-07T05:59:43+05:30 IST
పిఠాపురం, డిసెంబరు 6: వరదలు, తుఫాన్ల కారణంగా రంగుమారిన, మెలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ చెప్పారు. ఆదివారం ఆయన విలేకర్లలతో మాట్లాడుతూ భారీ వర్షాలు,

పిఠాపురం, డిసెంబరు 6: వరదలు, తుఫాన్ల కారణంగా రంగుమారిన, మెలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ చెప్పారు. ఆదివారం ఆయన విలేకర్లలతో మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లో ధాన్యం తడిచిపోయి రంగు మారిందని, మొలకెత్తిందని, కొనేవా రు లేక రైతులు నానా అగచాట్లు పడుతున్నారన్నారు. కొత్తపల్లి మండలం నాగులాపల్లి, గొల్లప్రోలు పట్టణాల్లో ధాన్యం కుప్పలుగా ఉండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కలెక్టర్ ఆదేశించినా రైతు భరోసా, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి కొనుగోళ్లు చేయడంలేదని తెలిపారు. కలెక్టర్, జేసీ స్పందించి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలని వర్మ కోరారు.