‘ఆదుకోకపోతే ఆత్మహత్యలే గతి’

ABN , First Publish Date - 2020-10-03T06:43:29+05:30 IST

ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాలలను ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే గతి అని ప్రైవేట్‌ పాఠశాలల అసోసియేషన్‌ నాయకులు పేర్కొన్నారు.

‘ఆదుకోకపోతే ఆత్మహత్యలే గతి’

కోరుకొండ, అక్టోబరు 2: ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాలలను ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే గతి అని ప్రైవేట్‌ పాఠశాలల అసోసియేషన్‌ నాయకులు పేర్కొన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మో పిందని నిరసనగా తమకు న్యాయం చేయాలంటూ రాజానగరం నియోజకవర్గ ప్రైవేట్‌ పాఠశాలల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 3 మండలాల ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఆ సంఘం అధ్యక్షుడు పెనకటి శివాజీ అధ్యక్షతన శుక్రవారం కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధి నుంచి ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు పంపించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంపై పోస్టుకార్డు ఉద్యమం ద్వారా ఒత్తిడి తెచ్చి తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే విధంగా ప్రయత్నం చేయాలన్నారు.


ఈఎంఐలు, అద్దెలు చెల్లించలేదని స్థితిలో ఉన్నామని.. చిన్న బడ్జెట్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు వడ్డీలేని రుణాలు ఇప్పించాలని, స్కూల్‌ బస్సుల పన్నులు ఏడాదిపాటు కాలపరిమితి పెంచాలని, 3 సంవత్సరాలకు కుదించిన స్కూల్‌ గుర్తింపు నిబంధనలను 10 సంవత్సరాలకు వర్తింప చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గరగ లక్ష్మీపద్మావతి, సత్యం శ్రీనివాసు, పి.గంగాధరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T06:43:29+05:30 IST