ప్రభల ఉత్సవాన్ని కొవిడ్‌కు అనుగుణంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-12-26T06:37:03+05:30 IST

సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో నిర్వహించనున్న ప్రభల తీర్థం కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూచించారు.

ప్రభల ఉత్సవాన్ని కొవిడ్‌కు అనుగుణంగా నిర్వహించాలి

అంబాజీపేట, డిసెంబరు 25:  సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో నిర్వహించనున్న  ప్రభల తీర్థం కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు  సూచించారు. వక్కలంక శ్రీఅన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో 11 ప్రభల ఉత్సవ కమిటీలతో సమావేశం డొక్కా సోమశంకరరావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈసందర్భంగా ఉత్సవ నిర్వాహకులు  కొవిడ్‌ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వాసంశెట్టి పెదబాబు, ఎం.ఎం.శెట్టి, యనమదల రాజబాబు, పుల్లేటికుర్రు సత్యనారాయణమూర్తి, వెలవెలపల్లి సుబ్రహ్మణ్యశర్మ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-26T06:37:03+05:30 IST