రైతులకు పగలు విద్యుత్ సరఫరా: డిప్యూటీ సీఎం బోస్
ABN , First Publish Date - 2020-06-25T10:03:16+05:30 IST
రాష్ట్రంలోని రైతులందరికీ జూలై 1నుంచి పగలే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తారని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డిప్యూటీ సీఎం పిల్లి సుబాస్

రంగంపేట, జూన్ 24: రాష్ట్రంలోని రైతులందరికీ జూలై 1నుంచి పగలే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తారని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డిప్యూటీ సీఎం పిల్లి సుబాస్ చంద్రబోస్ తెలిపారు. మండలంలోని సింగంపల్లి, ఈలకొలనులో రూ.1.5కోట్లతో ఏర్పాటు చేసిన రెండు నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం, అమలాపురం ఎంపీలు భరత్‌రామ్, అనూరాధ, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ప్రసంగించారు.
విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 111 కోట్లు విద్యుత్‌శాఖ ఆధునికీకరణకు కేటాయించారని తెలిపారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డికి, ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. కార్యక్రమాల్లో విద్యుత్‌శాఖ ఏఈ గోపాలకృష్ణ నాయకులు, మురళీకృష్ణారెడ్డి, నల్లా శ్రీనివాసరావు, లంక చంద్రన్న పాల్గొన్నారు.