నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ABN , First Publish Date - 2020-05-17T09:30:08+05:30 IST
కలవచర్ల 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని కలవచర్ల, సీతారాంపురం గ్రామాల్లో ఆదివారం విద్యుత్

రాజానగరం, మే 16: కలవచర్ల 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని కలవచర్ల, సీతారాంపురం గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంద ని ఏఈ గంటాప్రసాద్ తెలిపారు. వార్షిక నిర్వహణలో భా గంగా ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేయనున్నట్టు ఆయన చెప్పారు.
రేపు జిల్లాలో పలుచోట్ల..
రాజమహేంద్రవరం సిటీ : జిల్లాలో పలు మండలాలకు సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తునట్లు ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం సర్కిల్ ఎస్‌ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
కాకినాడ అర్బన్‌లో..
అత్యవసర లైన్లు మరమ్మతులు, చెట్లకొమ్మల తొలగింపు పనుల నిమిత్తం సోమవారం గంగరాజునగర్ రోడ్, చైతన్యనగర్, శశికాంత్‌నగర్, ప్రసాద్‌మెన్సన్ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. తోట సుబ్బారావునగర్, బోట్ క్లబ్ ఏరియా, కృషిభవన్ రోడ్డు, రూరల్‌లో వాకలపూడి ఇండస్ట్రీయల్ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
పిఠాపురం మండలంలో...
కుమారపురం విద్యుత్ కేంద్రంలో మరమ్మతుల నిమిత్తం ఎఫ్‌కే పాలెం, కుమారపురం, కందరాడ, జల్లూరు, జగ్గయ్య చెరువు గ్రామాల్లో ఉదయం 7నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు.
గొల్లప్రోలు మండలంలో...
బి.ప్రత్తిపాడు ఉపకేంద్రం మరమ్మత్తుల నిమిత్తం బోగాపురం, గొల్లప్రోలు, బి.ప్రత్తిపాడుల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నారు.
పెదపూడి మండలంలో...
అత్యవసర లైన్ల మరమ్మతులు, చెట్లకొమ్మల తొలగింపు పనుల నిమిత్తం కరకుదురులో ఉదయం 7నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నారు.
తాళ్లరేవు మండలంలో...
ఇంజరం విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల నిమి త్తం సుంకరపాలెం, ఉప్పంగల, ఇంజరం, పిల్లంక, లచ్చిపాలెం, గోవలంక, అరటికాయలంక, సీహెచ్ భాపనపల్లి, పల్లిపాలెం, తాళ్లరేవు గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నారు.