విద్యుత్‌ తీగల ఉచ్చులో పడి గిరిజనుడి మృతి

ABN , First Publish Date - 2020-12-06T05:58:16+05:30 IST

రాజవొమ్మంగి మండలం శరభవరం పంచాయతీ దాకరాయి గ్రామానికి చెందిన చలుమర్తి నూకరాజు వన్య ప్రాణుల వేటకు వేసిన విద్యుత్‌ తీగల ఉచ్చులో పడి మృతి చెందాడు.

విద్యుత్‌ తీగల ఉచ్చులో పడి గిరిజనుడి మృతి

రాజవొమ్మంగి, డిసెంబరు 5: రాజవొమ్మంగి మండలం శరభవరం పంచాయతీ దాకరాయి గ్రామానికి చెందిన చలుమర్తి నూకరాజు వన్య ప్రాణుల వేటకు వేసిన విద్యుత్‌ తీగల ఉచ్చులో పడి మృతి చెందాడు. నూకరాజు తన మేకలు కనబడకపోవడంతో రాత్రి సమయంలో వెతకడానికి గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లాడు. అప్పటికే అడవి జంతువుల వేటకు కొంతమంది వేటగాళ్లు విద్యుత్‌ తీగల ఉచ్చును వేశారు. ఇది తెలియని నూకరాజు చీకటిగా ఉండగా ఆ విద్యుత్‌ తీగలవైపు వెళ్లి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నూకరాజు భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజవొమ్మంగి సీఐ ఎం.నాగ దుర్గారావు తెలిపారు.  

Read more