నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ABN , First Publish Date - 2020-10-03T07:12:16+05:30 IST
పి.గన్నవరం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 33కేవీ లైన్‌లో చెట్ల తొలగింపు, మరమ్మతు పనుల నేపథ్యంలో శనివారం ఉదయం తొమ్మిది నుంచి
పి.గన్నవరం, అక్టోబరు 2: పి.గన్నవరం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 33కేవీ లైన్‌లో చెట్ల తొలగింపు, మరమ్మతు పనుల నేపథ్యంలో శనివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటలు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏఈ జీవీ ఆచార్యులు తెలిపారు. పి.గన్నవరం, బోడపాటివారిపాలెం, ముంగండ, పోతవరం, కె.ముంజవరం, కఠార్లంక, ఆర్.ఏనుగుపల్లి, కె.ఏనుగుపల్లి, వై.కొత్తపల్లి, నాగుల్లంక, లంకలగన్నవరం, మొండెపులంక, మానేపల్లి, వాడ్రేవుపల్లి, చాకలిపాలెం గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని అన్నారు.