విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-06T06:01:55+05:30 IST

రాజోలు గ్యాస్‌ కంపెనీ సమీపంలోని పంట పొలంలో పనిచేస్తున్న దొంగ తాతయ్య(45) 11కేవీ విద్యుత్‌లైన్‌ తగలడంతో శనివారం మృతి చెందినట్టు రాజోలు ఎస్‌ఐ బి.కృష్ణమాచారి తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

రాజోలు, డిసెంబరు 5: రాజోలు గ్యాస్‌ కంపెనీ సమీపంలోని పంట పొలంలో పనిచేస్తున్న దొంగ తాతయ్య(45)  11కేవీ విద్యుత్‌లైన్‌ తగలడంతో శనివారం మృతి చెందినట్టు రాజోలు ఎస్‌ఐ బి.కృష్ణమాచారి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తాతయ్య పొలంలో ట్రాక్టరు లోడు నుంచి బస్తాలు కిందకు దింపుతుండగా ప్రమాదవశాత్తూ 11కేవీ విద్యుత్‌ వైర్లు తగిలాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కృష్ణమాచారి చెప్పారు. 


Read more