దేహధారుడ్య పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2020-10-31T06:22:24+05:30 IST

పుదుచ్చేరి పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్లు, రేడియో టెక్నిషన్‌, డెక్‌హెల్డార్‌ పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు దేహధారుడ్య పరీక్షలు స్థానిక జీఎంసి బాలయోగిక్రీడామైదానంలో నవంబరు 23 నుంచి 26వరకు దేహధారుడ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

దేహధారుడ్య పరీక్షలు వాయిదా

యానాం, అక్టోబరు 30: పుదుచ్చేరి పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్లు, రేడియో టెక్నిషన్‌, డెక్‌హెల్డార్‌ పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు దేహధారుడ్య పరీక్షలు స్థానిక జీఎంసి బాలయోగిక్రీడామైదానంలో నవంబరు 23 నుంచి 26వరకు దేహధారుడ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే  యానాం క్రీడా ప్రాంగణం సక్రమంగా లేదని గవర్నర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై గవర్నర్‌ అధికారులను వివరణ కోరారు. దీంతో ఈపరీక్షలు వాయిదా వేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను పుదుచ్చేరి పోలీస్‌శాఖ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.

Read more