చెరువులోకి దూసుకెళ్లిన కారు: కాపాడిన పోలీసులు

ABN , First Publish Date - 2020-12-07T05:58:43+05:30 IST

నలుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెరువులో పడిం ది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు సకాలంలో చెరువులోకి దిగి కాపాడారు.

చెరువులోకి దూసుకెళ్లిన కారు: కాపాడిన పోలీసులు

రాజానగరం, డిసెంబరు 6: నలుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెరువులో పడిం ది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు సకాలంలో చెరువులోకి దిగి కాపాడారు. రాజానగరం మండలం భూపాలపట్నం నుంచి నలుగురు వ్యక్తులతో వస్తున్న కారు అదుపుతప్పి శ్రీకృష్ణపట్నం గ్రామ శివారులో రహదారిని ఆనుకుని ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో విధి నిర్వహణలో భాగంగా సిబ్బందితో అటుగా వస్తున్న రాజానగరం సీఐ ఎంవీ సుభాష్‌, ఎస్‌ఐలు నాగబాబు, జుబైర్‌ సకాలంలో స్పందించి చెరువులోకి దిగి కారులో ఉన్న వారిని కాపాడారు.

Updated Date - 2020-12-07T05:58:43+05:30 IST