రాజమహేంద్రవరంలో సీఐ, ఎస్‌ఐల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-11-27T07:43:26+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీస్‌ శాఖ పరిధిలోని వన్‌టౌన్‌లో పనిచేస్తున్న సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్‌ చేస్తూ ఎస్‌పీ షిమోషి బాజ్‌పాయ్‌ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పూజలు చేస్తే బంగారం రెట్టింపు అవుతుందని నమ్మించి ఒక వ్యక్తిని కొందరు మోసగించారు.

రాజమహేంద్రవరంలో సీఐ, ఎస్‌ఐల సస్పెన్షన్‌

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 26: రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీస్‌ శాఖ పరిధిలోని వన్‌టౌన్‌లో పనిచేస్తున్న సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్‌ చేస్తూ ఎస్‌పీ షిమోషి బాజ్‌పాయ్‌ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పూజలు చేస్తే బంగారం రెట్టింపు అవుతుందని నమ్మించి ఒక వ్యక్తిని కొందరు మోసగించారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటనపై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాధితుడు ఈనెల 11న నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రోపర్టీ రికవరీ విషయంలో సీఐ శివగణేష్‌, ఎస్‌ఐ రాజులపై ఆర్థికపరమైన ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు వీరిపై బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఆమె విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించిన నివేదికను పరిశీలించిన ఎస్పీ ఈ మేరకు గురువారం వారిపై సస్పెన్షన్‌ ఉత్తర్వులను ఇచ్చారు.

Read more