మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం

ABN , First Publish Date - 2020-12-19T06:57:15+05:30 IST

విద్యార్థులు మత్తు పదార్థాల వాడకాన్ని, రవాణాను వ్యతిరేకించాలని సీఐ వి.కృష్ణ సూచించారు.

మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం
పి.గన్నవరం స్టేషన్‌ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

రావులపాలెం రూరల్‌, డిసెంబరు 18: విద్యార్థులు మత్తు పదార్థాల వాడకాన్ని, రవాణాను వ్యతిరేకించాలని సీఐ వి.కృష్ణ సూచించారు. రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసు, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం, రసాయన శాస్త్ర విభాగం ఆధ్వ ర్యంలో మత్తుపదార్ధాల రవాణాకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బీవీ తిరుపణ్యం ఆధ్వర్యంలో జరిగిన  ర్యాలీలో సీఐ వి.కృష్ణ, ఎస్‌ఐ పి.బుజ్జిబాబు పాల్గొని జాతీయ రహదారి మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ  మంచిస్నేహాలు, అలవాట్లు అలవరుచుకుని తల్లిదండ్రులకు, సమాజానికి మంచిపేరు తీసుకువచ్చేవిధంగా పాటుపడాలన్నారు. కార్యక్రమంలో గాంధీ, చినబాబు, సుజ్ఞాని, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 బానిస కాకూడదు

పి.గన్నవరం: యువత మత్తు పదార్థాలకు బానిసై బం గారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఎస్‌ఐ జి.సురేంద్ర అన్నారు. పి.గన్నవరంలో శుక్రవారం మారకద్రవ్యాలు నిషేధ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కొంత మంది విద్యార్థులు మద్యానికి బానిసై తమ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ నుంచి మూడు రోడ్ల కూడలి వరకు స్థానిక ఐటీఐ విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో విద్యార్థులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు  

కపిలేశ్వరపురం: యువత మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దంటూ శుక్రవారం అంగర, పడమరఖండ్రిక గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అంగర ఎస్‌ఐ హెచ్‌ శాస్త్రి మాట్లాడుతూ సిగరెట్‌, గుట్కా, మద్యపానం, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. ఎవ రైనా వాటిని కలిగి ఉన్నా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగర ఉన్నత పాఠశాల విద్యార్ధులు,  ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-19T06:57:15+05:30 IST