ఇసుక తవ్వకాలపై పోలీసులు దాడులు

ABN , First Publish Date - 2020-10-01T07:10:24+05:30 IST

మండల పరిధిలోని తిరుమాలి గ్రామంలో ఏలేరు కాలువ వెంబడి అనధికార ర్యాం పులో ఇసుక అక్రమ

ఇసుక తవ్వకాలపై పోలీసులు దాడులు

 రెండు ట్రాక్టర్లు, 11మోటారు బైక్‌లు స్వాధీనం


ఏలేశ్వరం, సెప్టెంబరు 30: మండల పరిధిలోని తిరుమాలి గ్రామంలో ఏలేరు కాలువ వెంబడి అనధికార ర్యాం పులో ఇసుక అక్రమ తవ్వకాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు.

ప్రత్తిపాడు సీఐ రాంబాబు నేతృత్వంలో ఏలేశ్వరం ఇన్‌చార్జి ఎస్‌ఐ బి.శంకరరావు, పోలీస్‌ సిబ్బంది చేపట్టిన దాడుల్లో రెండు ట్రాక్టర్లు, 11 మోటారు సైకిళ్లు, తవ్వకానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 23మంది కూలీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

Updated Date - 2020-10-01T07:10:24+05:30 IST