పోక్సోచట్టంలో నిందితుడికి పదేళ్ల జైలు
ABN , First Publish Date - 2020-11-13T08:07:30+05:30 IST
తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి కాకినాడ పోక్సో యాక్టు స్పెషల్ జడ్జి సి.సత్యవాణి పదేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానాతోపాటు బాధితురాలికి రూ.15వేలను నష్టపరిహారంగా అందించాలని గురువారం తీర్పుచెప్పారని ఎస్‌ఐ సీహెచ్ సుధాకర్ తెలిపారు.
రంగంపేట, నవంబరు 12: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి కాకినాడ పోక్సో యాక్టు స్పెషల్ జడ్జి సి.సత్యవాణి పదేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానాతోపాటు బాధితురాలికి రూ.15వేలను నష్టపరిహారంగా అందించాలని గురువారం తీర్పుచెప్పారని ఎస్‌ఐ సీహెచ్ సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2015, డిసెంబరులో ముకుందవరానికి చెందిన పంచకట్ల వెంకటేశులు(45) అనే వ్యక్తి 9ఏళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడని అప్పటి పోలీసులు కేసు నమోదు చేయగా అప్పటి సీఐ శ్రీధర్‌కుమార్ దర్యాప్తు జరిపారన్నారు. పోక్సో కోర్టులో గురువారం తీర్పు ఇచ్చారని ఎస్‌ఐ తెలిపారు.