‘క్షేత్రసహాయకులపై రాజకీయ వేధింపులు అరికట్టాలి’

ABN , First Publish Date - 2020-11-21T06:21:50+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తోన్న క్షేత్ర సహాయకులపై రాజకీయ వేధింపులు అరికట్టాలని డిమాండు చేస్తూ అమలా పురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఫీల్డ్‌అసి స్టెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్షేత్ర సహాయకులు ధర్నా నిర్వహించారు.

‘క్షేత్రసహాయకులపై రాజకీయ వేధింపులు అరికట్టాలి’

అమలాపురం టౌన్‌, నవంబరు 20: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తోన్న క్షేత్ర సహాయకులపై రాజకీయ వేధింపులు అరికట్టాలని డిమాండు చేస్తూ అమలా పురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఫీల్డ్‌అసి స్టెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్షేత్ర సహాయకులు ధర్నా నిర్వహించారు. సంఘ రాష్ట్ర నాయకుడు పి.మోహన్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబాజీపేట మండలం చిరతపూడి గ్రామ క్షేత్ర సహాయకుడు విప్పర్తి చంద్రశేఖర్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, దీనికి కారకులపై కేసు నమోదుచేసి అరెస్టు చేయా లని డిమాండు చేశారు.  ఈఆందోళనకు ప్రజాసంఘాల నాయకులు పచ్చిమాల వసంతకుమార్‌, రేవు తిరుపతిరావు, బొంతు చంద్రమోహన్‌లు సంఘీభావం తెలిపారు. వినతిపత్రాన్ని సబ్‌కలెక్టర్‌ కార్యాలయ పరిపాలానా ధికారి జవ్వాది వెంకటేశ్వరికి అందజేశారు. ధర్నాలో క్షేత్ర సహాయ కులు యిళ్ల నాగరాజు, చీకట్ల సుబ్బారావు, ముత్తాబత్తుల శ్రీను, అయితాబత్తుల శ్రీనివాస్‌, పి.మంగాదేవి, గుత్తుల సత్యవేణి, కందాల సూర్యవేణి, నేదునూరి సుజాత, దుర్గాభవాని  పాల్గొన్నారు. Read more