10 రోజుల పాటు పోలీసు అమరవీరుల వారోత్సవాలు

ABN , First Publish Date - 2020-10-21T05:59:16+05:30 IST

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 20: పోలీసు అమరవీరుల వారోత్సవాలను బుధవారం నుంచి ఈనెల 30 వరకు ఘనంగా నిర్వహించనున్నట్టు ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ కమాండెంట్‌ ఎస్‌.నాగరాజు

10 రోజుల పాటు పోలీసు అమరవీరుల వారోత్సవాలు

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 20: పోలీసు అమరవీరుల వారోత్సవాలను బుధవారం నుంచి ఈనెల 30 వరకు ఘనంగా నిర్వహించనున్నట్టు ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ కమాండెంట్‌ ఎస్‌.నాగరాజు తెలిపారు. ఉదయం ఏపీఎస్పీ బెటాలియన్‌లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నివాళులర్పిస్తూ పరేడ్‌ నిర్వహిస్తామన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం, విందు, బహుమతుల కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. 26న పోలీ్‌సలకు చెందిన పలు సినిమాల ప్రదర్శన, 27న రన్‌ ఫర్‌ యూనిటీ, విద్యార్థులకు పలు అంశాలపై డిబేట్‌, 28న ఉదయం 10 నుంచి 5 గంటల వరకు స్కూళ్ల విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 29న సాయంత్రం 6 గంటలకు ఏపీఎస్పీ బెటాలియన్‌ బ్యాండ్‌తో పాటు విద్యార్థుల బ్యాండ్‌ కార్యక్రమం, 30న పలు గ్రామాలు, సిటీలో పర్యటన ఉంటుందని ఆయన తెలిపారు.

Updated Date - 2020-10-21T05:59:16+05:30 IST