బ్రాహ్మణుల కోసం ప్రణాళిక

ABN , First Publish Date - 2020-10-07T09:57:53+05:30 IST

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన అన్ని వర్గాల్లోను బ్రాహ్మణులు కూడా ఉన్నారని, వీరిని శాశ్వతంగా ఆదుకోవడానికి ప్రభుత్వం తరపున ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు...

బ్రాహ్మణుల కోసం ప్రణాళిక

క్రెడిట్‌ సొసైటీ సభ్యుల్ని లక్షకు పెంచండి ఫ ఉప సభాపతి కోన రఘుపతి 


గోదావరిసిటీ, అక్టోబరు 6: కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన అన్ని వర్గాల్లోను బ్రాహ్మణులు కూడా ఉన్నారని, వీరిని శాశ్వతంగా ఆదుకోవడానికి ప్రభుత్వం తరపున ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. బ్రాహ్మణులు ప్రభుత్వంపై ఆధారపడకుండా తమ బ్రాహ్మణ క్రెడిట్‌ సొసైటీ ద్వారా లబ్ధి పొందేందుకు సభ్యుల్ని లక్షకు పైగా పెంచాలని ఆయన సూచించారు. విశాఖ నుంచి వెళ్తూ మార్గమధ్యంలో నగరంలో మంగళవారం ఆగిన ఆయనను జిల్లా బ్రాహ్మణ సేవాసంఘం సమైఖ్య అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాసు, నగర అధ్యక్షుడు దూర్వాసుల సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. యువసేన తరుపున ప్రతినెల పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న జిల్లా బ్రాహ్మణ యువజన సమైక్య సహాయక కార్యదర్శి చెరుకూరి నాగసాయిని రఘుపతి అభినందించి సేవా కార్యక్రమాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్లకు పింఛన్ల భారం తప్పిందని, ఇకపై పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. బ్రాహ్మణులకు పరిమితమై ఉన్న క్రెడిట్‌ సొసైటీకి ఇప్పటికే సుమారుగా రూ.10 కోట్ల వరకు మూలనిధి ఉందని, సభ్యులను చేర్చడం ద్వారా నిధిని ఇంకా పెంచుకోవాలన్నారు. తద్వారా ప్రభుత్వంపై ఆధారపడకుండా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సమా జంలో అన్ని వర్గాలవారికి వివిధ ఉపాధి పథకాలు ఇప్పటికే ప్రభుత్వం అందజేస్తుందని తద్వారా అనేక మంది లబ్ధిపొందారని రఘుపతి తెలిపారు.

Read more