-
-
Home » Andhra Pradesh » East Godavari » picture show
-
‘బొమ్మ’ పడింది..!
ABN , First Publish Date - 2020-12-19T07:12:16+05:30 IST
జిల్లాలో శుక్రవారం సినిమా సందడి మొదలైయ్యింది. కొవిడ్ నేపథ్యంలో నెలల తరబడి థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే.

భానుగుడి(కాకినాడ)/ గోదావరి సిటీ, డిసెంబరు 18: జిల్లాలో శుక్రవారం సినిమా సందడి మొదలైయ్యింది. కొవిడ్ నేపథ్యంలో నెలల తరబడి థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఽథియేటర్లు తెరవాలా వద్దా అనే సంది గ్ధంలో యాజమాన్యాలు ఉండగా, కాకినాడలోని సత్యగౌరి థియేటర్ యాజమాన్యం మాత్రం ‘మమ్మి ఈజ్ బ్యాక్’ చిత్ర ప్రదర్శనతో శుక్రవారం శుభారంభం పలికింది. దీంతో చాలాకాలం నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారు ఽథియేటర్ల వైపు అడు గులు వేశారు. ప్రేక్షకులు పరిమిత సంఖ్యలో హాజరైనప్పటికీ ఆ కాస్త స్పందనైనా కనిపించేసరికి అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే కొవిడ్ నిబంధనల మేరకు మాస్క్ ధరించడంతోపాటు శానిటైజ్ చేసుకుని లోపలికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అలాగే 50 శాతం టిక్కెట్లనే విక్రయించడానికి వీలుగా థియేటర్‌లోపల సీట్లను కూడా మధ్యలో ఇంటూ మార్కు వేసి ఉంచేశారు. ఇదిలా ఉండగా గత తొమ్మిది నెలలుగా మూతపడిన రాజమహేంద్రవరం థియేటర్లు ఒక్కొక్కటిగా పునఃప్రారంభం కానున్నాయి. స్థానిక శివజ్యోతి థియేటర్‌లో శనివారం నుంచి ‘టినెట్’ అనే ఆంగ్లచిత్రాన్ని తెలుగులో రోజుకు నాలుగు ఆటలతో ప్రారంభించనున్నట్టు థియేటర్ యాజమాన్యం తెలిపింది. నగరంలో ఈనెల 25న మరో రెండు థియేటర్లలో సినిమా ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 140 ఽథియేటర్లు ఉండగా, ఇప్పటివరకు మూతపడి ఉన్న ఽథియేటర్లు సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల నిర్వహణకు సంబంధించి విద్యుత్ రాయితీలను ప్రకటించింది. అలాగే థియేటర్లు తెరిచేందుకు వీలుగా ‘రీస్టార్ట్’ పేరుతో రుణ సదుపా యం కల్పించే దిశగా కూడా నిర్ణయం తీసుకుంది. అయితే థియేటర్ల నిర్వాహకులు మరికొన్ని డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందుంచారు. రాయితీలు, టాక్సుల రద్దు వంటి అంశాలపై పూర్తి స్థాయిలో సహకరించాలని వారంతా కోరుతున్నారు.