దివ్యాంగుల సంక్షేమానికి కృషి

ABN , First Publish Date - 2020-12-13T06:05:43+05:30 IST

దివ్యాంగులకు అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం జగన కృషి చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి, విద్యావేత్త వడిశెట్టి నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు చెప్పారు.

దివ్యాంగుల సంక్షేమానికి కృషి

మూలపేట(కొత్తపల్లి), డిసెంబరు 12: దివ్యాంగులకు అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం జగన కృషి చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి, విద్యావేత్త వడిశెట్టి నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు చెప్పారు. మూలపేటలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల హక్కుల పోరాట సమితి  సమావేశంలో వారు ప్రసంగించారు. అర్హత కలిగిన దివ్యాంగులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని, సదరమ్‌ క్యాంపు ఏర్పాటు చేయాలని పలు వురు దివ్యాంగులు నాయకులకు మొర పెట్టుకున్నారు. దీంతో నాయకులు ఎమ్మెల్యే దొరబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా మని చెప్పారు. కార్యక్రమంలో వికలాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అంకం వీరవెంకట సత్యనారాయణ, పరిరక్షణ సమితి నాయకుడు షేక్‌ రహీం, వైసీపీ నాయకులు వెంగళి సుబ్బారావు, ఆనాల సుదర్శన్‌, కంబాల లక్ష్మణ్‌, ఉమ్మిడి జాన్‌, వడ్డి నాగమణి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T06:05:43+05:30 IST