ఫార్మాలో మరింత అభివృద్ధి అవసరం

ABN , First Publish Date - 2020-10-21T05:43:02+05:30 IST

కొవిడ్‌-19 వంటి వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యమున్న మందులను తయారు చేయడంలో ఫార్మా రంగంలో మరిం త అభివృద్ధి అవసరమని నన్నయ వీసీ మొక్కా జగన్నాథరావు అన్నారు.

ఫార్మాలో మరింత అభివృద్ధి అవసరం

  • ‘నన్నయ’ వీసీ జగన్నాథరావు

 దివానచెరువు, అక్టోబరు 20: కొవిడ్‌-19 వంటి వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యమున్న మందులను తయారు చేయడంలో ఫార్మా రంగంలో మరిం త అభివృద్ధి అవసరమని నన్నయ వీసీ మొక్కా జగన్నాథరావు అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ అండ్‌ హెల్త్‌ సైన్సెస్‌, ఫార్మా ట్రైన ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ వెబినార్‌ నిర్వహించారు. ఫార్మా, బయోటిక్‌ రంగాల్లో ఆవరణలు, వాగ్దానాలపై జరిగిన ఈ వెబినార్‌లో వీసీ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పుకుంటున్నా ఓ వైరస్‌ కార ణంగా అభివృద్ధి, ప్రమాణాలు శూన్యంగా మారాయన్నారు. కొవిడ్‌-19 వంటి విపత్తులను ఎదుర్కోవడంలో వైద్య, ఆరోగ్య, ఔషధ శాస్త్ర రంగాలు పని చేస్తున్నా ఆశించిన ఫలితాలను వెంటనే చూడలేకపోతున్నామన్నారు.  భవి ష్యతలో బహుళ వైరస్‌ల నివారణకు సంబంధించిన ఔషధాలను తయారు చేయడంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపాలని కోరారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మా స్యూటికల్స్‌ సైన్సెస్‌ కళాశాల ఆచార్యుడు జి.గిరిజా శంకర్‌ బయో ఫార్మా స్యూటికల్స్‌లోని సవాళ్లను వివరించారు. కార్యక్రమంలో నన్నయ రిజిసా్ట్రర్‌ బట్టు గంగారావు, ప్రిన్సిపాల్‌ కె.రమణేశ్వరి, వక్తలు జీఎనవీ చంద్రశేఖరరెడ్డి, ఎంఎస్‌ సర్వేశ్వరరావు, జేపీ శ్రీనివాసరెడ్డి, కె.తాతా రావు, ఎ.మట్టారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-21T05:43:02+05:30 IST