పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ఆందోళన

ABN , First Publish Date - 2020-06-23T10:45:37+05:30 IST

అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరల ఆధారంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ..

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ఆందోళన

కాకినాడ (డెయిరీఫారమ్‌ సెంటర్‌), జూన్‌ 22: అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరల ఆధారంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ట్రాన్స్‌పోర్ట్‌ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ సీనియర్‌ నాయకుడు దువ్వ శేషబాబ్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ 15 రోజులుగా ప్రతిరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. జూలై 3న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న శాసనోల్లంఘన ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 

Read more