గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం

ABN , First Publish Date - 2020-10-03T06:25:43+05:30 IST

పిఠాపురంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు మున్సిపల్‌ కార్యాలయంలోని గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం శుక్రవారం అందించారు.

గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం

పిఠాపురం, అక్టోబరు 2: పిఠాపురంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు మున్సిపల్‌ కార్యాలయంలోని గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం శుక్రవారం అందించారు. మహాత్మ గాంధీ పేరుపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ఆలోచనలో ఉన్న మోదీకి జ్ఞానోదయం కలగాలని వేడుకున్నారు. గ్రామాల్లో ప్రజలకు ఉపాధి పథకంలో 200 పనిదినాలు కల్పించాలని వేడుకున్నారు. కూలీలకు రూ.600 వేతనం ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లోనూ పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కూరాకుల సింహాచలం, రుద్రవరపు భూలోకం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T06:25:43+05:30 IST