ప్రజలకు లోటుపాట్లు రాకుండా చూడాలి

ABN , First Publish Date - 2020-03-27T10:21:50+05:30 IST

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు రానీయకుండా

ప్రజలకు లోటుపాట్లు రాకుండా చూడాలి

నిత్యావసరాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని


కాకినాడ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు రానీయకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని గురువారం రాత్రి అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌నుంచి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జేసీ లక్ష్మీశ, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, జేసీ2 రాజకుమారి, డీఎంహెచ్‌వో సత్యసుశీల, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రాఘవేంద్రరావు, కోవిడ్‌-19 వైరస్‌ నియంత్రణ నోడల్‌ అధికారి డాక్టర్‌ మల్లిక్‌ పాల్గొన్నారు.


వినియోగదారుల సౌకర్యార్థం ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వెసులుబాటు ఇచ్చిన సమయాల్లో జన సమూహాలు ఎక్కువగా ఉండకుండా, సామాజిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని చీఫ్‌ సెక్రటరీ సూచించారు. వలంటీర్లు చేస్తున్న సర్వేలో విదేశాలనుంచి వస్తున్న వ్యక్తులను గుర్తించి వారి జాబితాను అప్‌డేట్‌ చేస్తూ వైద్యఆరోగ్యశాఖకు అందజేయాలన్నారు.

Updated Date - 2020-03-27T10:21:50+05:30 IST