నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యం

ABN , First Publish Date - 2020-11-03T06:58:54+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తుందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు.

నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యం

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి  విశ్వరూప్‌
అమలాపురం టౌన, నవంబరు 2: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తుందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రూ.5.75 కోట్ల నాబార్డు నిధులతో ఏపీ వైద్యవిధాన పరిషత ఆధ్వర్యంలో ఆసుపత్రి మూడో అంతస్థులో నూతనంగా 50 పడకలకు సంబంధించి నిర్మించనున్న అదనపు భవనాలకు, ఆసుపత్రి అభివృద్ధి పనులకు ఎంపీ చింతా అనురాధతో కలిసి మంత్రి విశ్వరూప్‌ సోమవారం శంకుస్థాపన చేశారు. ఆసుపత్రిలో లక్ష్యానికి మించి ప్రసవాలు జరుగుతున్నాయని, అన్నిరకాల వ్యాధులకు వైద్యం అందుబాటులో ఉందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఇనచార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుప్రియ, ఆర్‌ఎంవో వీఆర్‌కే.మూర్తి, డాక్టర్‌ మోకా ప్రసాదరావు, డాక్టర్‌ కౌముది, డాక్టర్‌ కిరణ్మయి, డాక్టర్‌ హేమంతచక్రధర్‌, తహశీల్దార్‌ గెడ్డం రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, వంటెద్దు నాయుడు, కల్వకొలను బాబి, తోట శ్రీను, సుంకర సుధ, బోనం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

 టి.కొత్తపల్లి ఆసుపత్రి అభివృద్ధికి రూ.7.41కోట్లు
ఐ.పోలవరం, నవంబరు 2: టి.కొత్తపల్లి ఆసుపత్రి అభివృద్ధికి రూ.7.41కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి వైద్యాధికారులు, స్థానికులతో సోమవారం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ చర్చించారు.  సమావేశంలో వైద్యాధికారులు ఏఎస్‌వీఎస్‌ ప్రసాద్‌, వైసీపీ మండల కన్వీనర్‌ పిన్నమరాజు శ్రీనురాజు, సొసైటీ అధ్యక్షులు వడ్డి గౌతమ్‌, ఢిల్లీ నారాయణ, పండు విజయకుమార్‌, కాళే రాజబాబు, పెన్మెత్స వాసురాజు, దంతులూరి రాఘవరాజు, సకిలే వెంకటేశ్వరరావు, ఏలూరి ఆదినారాయణ, మోకా రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-03T06:58:54+05:30 IST