హైవేపై ఇసుక లారీలు నిలుపుదల

ABN , First Publish Date - 2020-10-07T08:43:52+05:30 IST

214 జాతీయ రహదారిపై బోడసకుర్రు పరిధిలో ఇసుక లారీలు గంటల తరబడి నిలిపివేస్తున్నారు...

హైవేపై ఇసుక లారీలు నిలుపుదల

అల్లవరం, అక్టోబరు 6:  214 జాతీయ రహదారిపై  బోడసకుర్రు పరిధిలో ఇసుక లారీలు గంటల తరబడి నిలిపివేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రావులపాలెం, రాజమహేంద్రవరం ఇసుక ర్యాంపుల నుంచి లారీల కొద్దీ ఇసుకను బోడసకుర్రు ఏపీఎండీసీ ఇసుక స్టాక్‌ పాయింట్‌కు తరలిస్తున్నారు. ఇసుక దిగుమతిలో జాప్యంతో జాతీయ రహదారిపైనే కిలోమీటరు పొడువునా 40నుంచి 50కిపైగా లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్‌ సమస్య వస్తుంది. లారీల నుంచి నీరు, ఇసుక రోడ్డుపై పడడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read more