ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: ఐటీడీఏ పీవో

ABN , First Publish Date - 2020-12-10T06:03:16+05:30 IST

ఏజెన్సీలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య చెప్పారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: ఐటీడీఏ పీవో
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య

రంపచోడవరం, డిసెంబరు 9: ఏజెన్సీలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య చెప్పారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వ్యవసాయ, వెలుగు అధికారులు, సచివాలయ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లతో ఆయన సమావేశం నిర్వహించారు. అడ్డతీగల, ఇందుకూరుపేట, గంగవరం, మొల్లేరు, వై.రామవరం, జడ్డంగి, ఐ.పోలవరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మారేడుమిల్లి మండలంలో కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలోని ఏడు మండలాల్లోని సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు ఐదు టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. గిరిజన రైతులు దళారుల వద్ద మోసపోకుండా కొనుగోలు కేంద్రాల వద్దే అమ్ముకునే విధంగా వ్యవసాయశాఖ, వెలుగు, వ్యవసాయ పరపతి సంఘం సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వీకే సీనానాయక్‌, ఏపీవో పీవీఎస్‌ నాయుడు, ఎస్‌వో వెంకటేశ్వరరావు, వెలుగు ఏపీడీ చినశ్రీనివాసరావు, ఏడీలు శ్యామల, రత్నకుమార్‌, పీహెచ్‌వో వై.సత్యనారాయణ, తహశీల్దారు కె.లక్ష్మీకళ్యాణి పాల్గొన్నారు. 


  • రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు చర్యలు


గిరిజన రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఐటీడీఏ చర్యలు చేపట్టిందని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ఆదిత్య అన్నారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన హర్టీకల్చర్‌ అధికారులు, గ్రామ సచివాలయ హర్టీకల్చర్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. జీసీసీల ద్వారా జీడిమామిడి పిక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జీడిమామిడి మొక్కలకు పూత సమయంలో స్ర్పేయింగ్‌ చేసే మైక్రోన్యూట్రిన్‌ మందును అర్హులైన గిరిజనులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. రైతులకు సబ్సిడీతో స్ర్పేయర్లు అందిస్తామని, అందుకు లబ్ధిదారుడి వాటాగా రూ.580 చెల్లించాలని సూచించారు. రైతులకు సంబంధించిన వివరాలను పది రోజులలోగా కార్యాలయానికి సమర్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏపీవో పీవీఎస్‌ నాయుడు, పీహెచ్‌వో వై.సత్యనారాయణ, ఏపీడీ చిన శ్రీనివాసరావు, ఏడీఏ దేవానంద్‌కుమార్‌, హర్టికల్చర్‌ అధికారి ఎన్‌.రమేష్‌, ఎస్‌వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-10T06:03:16+05:30 IST