-
-
Home » Andhra Pradesh » East Godavari » orphans parents
-
అనాథ పిల్లలకు తల్లిదండ్రులను ఇద్దాం
ABN , First Publish Date - 2020-11-25T06:16:44+05:30 IST
సమాజంలో అనాథలుగా ఉన్న బాలలకు దత్తత ద్వారా తల్లిదండ్రులను ఇద్దామని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ డి.పుష్పమణి అన్నారు.

- జిల్లా మహిళా శిశు, సంక్షేమ శాఖ పీడీ పుష్పమణి
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 24: సమాజంలో అనాథలుగా ఉన్న బాలలకు దత్తత ద్వారా తల్లిదండ్రులను ఇద్దామని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ డి.పుష్పమణి అన్నారు. రాజమహేంద్రవరంలో జియాన్ సంస్థలు, చైల్డ్‌లైన్ 1098, వరల్డ్‌విజన్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో దత్తతపై జరిగిన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పుష్పమణి మాట్లాడుతూ దత్తత మూడు రకాలు వుంటుందని స్వదేశి దత్తత, విదేశి దత్తత, రక్త సంబంధీకుల దత్తత ఉంటుందని చెప్పారు. పిల్లలు వద్దు అనుకున్న తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, అనాథలుగా తిరిగే పిల్లలు కనిపిస్తే మహిళ శిశు సంక్షేమ శాఖకు తెలియజేయాలన్నారు. చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ బి.పద్మావతి మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని పిల్లలకు సంరక్షకులు ఉండి వారిని పోషించలేని పరిస్థితి వుంటే ఆలాంటి బాలలను దత్తత ఇవ్వవచ్చని చెప్పారు. ఇలాంటి దత్తతకు సీడబ్ల్యూసీ వారిని సంప్రదించవచ్చని చెప్పారు. ఐసీడీఎస్ అసిస్టెంట్ పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ నవంబరు నెలను దత్తత నెలగా ప్రభుత్వం ప్రకటించినందున జిల్లా అంతట ఈ దత్తతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బాలల సంరక్షణాధికారి వెంకటరావు, డీఎమ్‌హెచ్‌వో డాక్టర్ కోమలి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు లక్ష్మీతాయారు, జిల్లా ప్రొహిబిషన్ అధికారి ఎం.శరత్, చైల్డ్‌లైన్ 1098 కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు, శిశు గృహ మేనేజరు ప్రమీల, పీవోఐసీ లక్ష్మీ, రామకోటి, కౌన్సిలర్ అబీషాలోమ్ పాల్గొన్నారు.
- భిక్షాటనలో ఉన్న బాలలను బడిబాట పట్టించాలి
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 24: రోడ్లపై భిక్షాటన చేస్తున్న పిల్లల్ని గుర్తించి వారిని బడులలో చేర్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బ బిత అన్నారు. రాజమహేంద్రవరం న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో మంగళవారం బాలల యాచక, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలపై డీఎల్‌ఎస్‌ఎ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కెవీఎల్ హిమబిందు అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సుకు బబిత ముఖ్యఅతిథిగా విచ్చేశారు. బబిత మాట్లాడుతూ ఎవరికైనా రోడ్లపై భిక్షాటన చేస్తున్న బాలలు తారసపడితే వారిని చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ ద్వారా ఆశ్రయం కల్పించడంతోపాటు చదువుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలను భిక్షాటన వైపు మళ్లీస్తున్నారని అలాంటి వారిని గుర్తించి వారి సామాజిక, ఆర్థిక పరిస్ధితులను అధ్యాయనం చేసి వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషిచేయాలని సూచించారు. అవసరమైతే న్యాయసేవాధికార సంస్థ సహకారం తీసుకోవాలన్నారు. సమష్టి భాగస్వామ్యంతో బా లకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలన్నారు. న్యాయమూర్తి హిమబిందు మాట్లాడుతూ భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించినప్పుడు వారిని సంరక్షణ గృ హాలకు తరలించే క్రమంలో ఏమైన ఇబ్బం దు లు ఎదురైతే పారా లీగల్ వలంటీర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. సదస్సులో 26 డివిజన్లలోని గ్రామసచివాలయాల మహిళ రక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు.