ఆపరేషన్‌ ‘సుర’

ABN , First Publish Date - 2020-03-12T09:13:54+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లాలో పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం 20

ఆపరేషన్‌ ‘సుర’

సారా బట్టీలు, బెల్ట్‌ షాపులపై దాడులు 

42 మంది అరెస్టు

114 మద్యం సీసాలు, 929 లీటర్ల సారా  స్వాధీనం 


రాజమహేంద్రవరం సిటీ, మార్చి  11: రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లాలో పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం 20 బృందాలతో సారా బట్టీలు, బెల్ట్‌షాపులపై దాడులు జరిగాయి. పోలీసులు 29 కేసులు నమోదు చేసి 42 మందిని అరెస్టు చేశారు. బెల్ట్‌షాపులపై దాడులుచేసి 114 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి 929 లీటర్లు సారాను స్వాధీనం చేసుకుని 200లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేశా రు. ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 25 ప్రత్యేక బృందాలు దాడులు చేస్తున్నాయి.


39 కేసులు నమోదు చేసి 38 మందిని అరెస్టు చేశాయి. వారి నుంచి 505 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. 23,900 లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ దాడులు కొనసాగుతాయని అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమొషిబాజ్‌పాయ్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌  బి.అరుణారావు తెలిపారు. ఎక్కడైన మద్యం సీసాలు అమ్మినా, సారా తయారు చేసి అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2020-03-12T09:13:54+05:30 IST