అమలాపురంలో ఆపరేషన్‌ ముస్కాన్‌

ABN , First Publish Date - 2020-07-15T10:36:55+05:30 IST

వీధి బాలలకు భద్రత కల్పించడంతో పాటు వారికి విద్యను అందించేందుకు చేపట్టిన ఫేజ్‌-6 ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని..

అమలాపురంలో ఆపరేషన్‌ ముస్కాన్‌

అమలాపురం టౌన్‌, జూలై 14: వీధి బాలలకు భద్రత కల్పించడంతో పాటు వారికి విద్యను అందించేందుకు చేపట్టిన ఫేజ్‌-6 ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని మంగళవారం  డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డివిజన్‌స్థాయిలో వీధి బాలలను గుర్తించి, వారిని కాపాడేందుకు మెడికల్‌, పోలీసు, స్ర్తీశిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఈనెల 20వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో తాలూకా సీఐ జి.సురేష్‌బాబు, తాలూకా ఎస్‌ఐ సీహెచ్‌.రాజేష్‌, సఖినేటిపల్లి ఎస్‌ఐ భవానీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-07-15T10:36:55+05:30 IST