రథసప్తమికి ప్రారంభిస్తాం

ABN , First Publish Date - 2020-12-28T06:41:26+05:30 IST

భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకే అగ్నికి ఆహుతి అయిన శ్రీలక్ష్మీనరసింహస్వామి రథం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన రథాన్ని తయారు చేయించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.

రథసప్తమికి ప్రారంభిస్తాం
నూతన రథంలో భాగమైన నరసింహ అవతారాన్ని చూపిస్తున్న మంత్రి వేణు, కలెక్టర్‌ మురఽళీధర్‌రెడ్డి, దేవదాయ శాఖ ఏడీసీ రామచంద్రమోహన, సబ్‌ కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌

  • చెప్పిన సమయం కన్నా ముందే నూతన రథాన్ని సిద్ధం చేశాం: మంత్రి వేణు

అంతర్వేది, డిసెంబరు 27: భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకే అగ్నికి ఆహుతి అయిన శ్రీలక్ష్మీనరసింహస్వామి రథం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన రథాన్ని తయారు చేయించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌, దేవదాయ శాఖ ఏడీసీ రామచంద్రమోహనలతో కలిసి నూతన రథాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భీష్మ ఏకాదశి పర్వదినానికి అన్ని హంగులతో తీర్చిదిద్ది రథసప్తమి నాడు ప్రారంభిస్తామని చెప్పారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అనుకున్న సమయాని కంటే పది రోజుల ముందే రథాన్ని సిద్ధం చేశామన్నారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ  దేవదాయ శాఖ అధికారులు, ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు, శిల్పి ఒక చాలెంజ్‌గా తీసుకుని సకాలంలో తయారు సిద్ధం చేశారన్నారు. నూతన రథ నిర్మాణానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరినీ ఆయన అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ మాధవరెడ్డి, సహాయ కమిషనరు యర్రంశెట్టి భద్రాజీ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T06:41:26+05:30 IST