నేటి నుంచి నిత్యం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్ వ్రతాలు
ABN , First Publish Date - 2020-10-03T07:30:39+05:30 IST
సత్యదేవుడి సన్నిధిలో నూతనంగా ప్రవేశబెట్టిన ఆన్‌లైన్ వ్రతాల సేవలను శనివారం నుంచి ప్రతి నిత్యం ఉదయం 9 గంటలకు
అన్నవరం, అక్టోబరు 2: సత్యదేవుడి సన్నిధిలో నూతనంగా ప్రవేశబెట్టిన ఆన్‌లైన్ వ్రతాల సేవలను శనివారం నుంచి ప్రతి నిత్యం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు వెల్లడిం చారు. భక్తులు 1,116 రూపాయలు కార్యనిర్వహణా ధికారి, ఎస్‌వీవీఎస్ దేవస్థానం, అన్నవరం ఎస్‌బీఐ అకౌంట్ 37460007010, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బిఐన్ 0021804కి చెల్లించి గోత్రం, చిరునామా తదితర వివరాలను 9491249990 వాట్సప్‌కి పంపించాలని, అధికారులు దీన్ని పరిశీలించి యూట్యూబ్ లింక్ ద్వారా వీక్షించే ఏర్పాటు చేస్తారని, స్వామివారి బంగీ ప్రసాదం పోస్టు ద్వారా పంపిస్తారని తెలిపారు.