ఆనలైనలో రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్యపోటీలు

ABN , First Publish Date - 2020-10-31T06:18:44+05:30 IST

సంస్కారభారతి రాష్ట్ర శాఖ, అఖిలా భారత కూచిపూడి నాట్య కళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కూచిపూడి స్వీయ ప్రదర్శన నృత్యపోటీలు నిర్వహిస్తున్నట్టు సంస్కార భారతి ప్రతినిధి వేదనభట్ల సాయిలక్ష్మి తెలిపారు.

ఆనలైనలో రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్యపోటీలు

అమలాపురం టౌన, అక్టోబరు 30: సంస్కారభారతి రాష్ట్ర శాఖ, అఖిలా భారత కూచిపూడి నాట్య కళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కూచిపూడి స్వీయ ప్రదర్శన నృత్యపోటీలు నిర్వహిస్తున్నట్టు సంస్కార భారతి ప్రతినిధి వేదనభట్ల సాయిలక్ష్మి తెలిపారు. ఆనలైనలో జరిగే ఈపోటీలకు నవంబరు 8లోగా తమ ప్రదర్శనల వీడియోలను పంపించాలన్నారు. సంస్కారభారతి సంయోజకులు పసుమర్తి కేశవప్రసాద్‌, గూటాల రామ కుమార్‌ల పర్యవేక్షణలో జరిగే పోటీలకు 26ఏళ్లలోపు  వారు అర్హులన్నారు.  జిల్లాల వారీగా ఈ-మెయిల్‌ ఐడీ  వివరాలను సెల్‌ 9949618846, 98480 35573లను సంప్రదించి తెలుసుకోవాలన్నారు. విజేతలను నవంబరు 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు జిల్లాల వారీగా ప్రకటిస్తామని తెలిపారు.


Read more