తగ్గిన ఉల్లి ధర

ABN , First Publish Date - 2020-11-27T07:42:20+05:30 IST

ఉల్లి ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు మార్కెట్‌ వర్గాల కథనం. కొద్దిరోజుల వరకూ మహారాష్ట్ర ఉల్లిపాయల మీదే ఆధారపడడంవల్ల ధరలు విపరీతంగా పెంచేశారు. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్‌ నుంచి ఉల్లిపాయల రాక మొదలైంది. దీంతో ఉల్లి ధర క్రమంగా తగ్గుతోంది.

తగ్గిన ఉల్లి ధర


  • హోల్‌సేల్‌లో నెంబర్‌1 కిలో రూ.40-రూ.45
  • కనీస ధర కిలో రూ.30
  • మధ్యప్రదేశ్‌ రకం రావడంతో తగ్గుతున్న ధర

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఉల్లి ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు మార్కెట్‌ వర్గాల కథనం. కొద్దిరోజుల వరకూ మహారాష్ట్ర ఉల్లిపాయల మీదే ఆధారపడడంవల్ల ధరలు విపరీతంగా పెంచేశారు. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్‌ నుంచి ఉల్లిపాయల రాక మొదలైంది. దీంతో ఉల్లి ధర క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం హోల్‌సేల్‌ మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.40 నుంచి రూ.45వరకూ ఉన్నాయి. రెండోరకం కిలో రూ.30వరకూ ఉన్నాయి. రెండో రకం పాయలనే రిటైల్‌ మార్కెట్‌లో రూ.40నుంచి రూ.50వరకూ అమ్మేస్తున్నారు. జిల్లాకు రోజుకు 200టన్నులకు పైగా ఉల్లి సరఫరా అవు తోంది. రాజమహేంద్రవరంలో 100 టన్నులు, రావులపాలెంలో 70 టన్నులు, కాకినాడలో 40టన్నుల వరకూ ఉల్లి దిగుమతి అవుతోంది. ఇదే జిల్లాలోని అన్ని గ్రామాలకు చేరుతుంది. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వంటి ప్రాంతాలకు కూడా ఉల్లి సరఫరా అవుతోంది. ఇక కూరగాయల ధరలు బాగా తగ్గాయి. టమోటా నెంబరు రకం కిలో రూ.30 వరకూ ఉండగా ఓ మోస్తరువి కిలో రూ.20 కి దొరుకుతున్నాయి. బెండ, దొండ కూడా కిలో రూ.20కే లభ్యమవుతోంది. చిక్కుడు కాయలు కిలో రూ.40-రూ.60 వరకు పలుకుతున్నాయి. ఆకుకూరలు, కొత్తమీర కూడా అందుబాటులో ఉన్నాయి. తుపాన్‌ ప్రభావం రెండురోజు ల కంటే ఎక్కువుంటే ధరలు పెరిగే అవకాశం ఉంది.

Read more