చమురు సంస్థల కార్యకలాపాలతో ముప్పెంత?
ABN , First Publish Date - 2020-10-28T06:52:34+05:30 IST
కృష్ణా గోదావరి బేసినలో ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు నిర్వహిస్తున్న కార్యకలాపాల వల్ల తరచూ ప్రమాదాలు ఉత్పన్నం కావడం, పర్యావరణ కాలుష్యం ఏర్పడడం వంటి కారణాలపై నేషనల్ గ్రీన ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పందించింది. ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల కార్యకలాపాల వల్ల గోదావరి జిల్లాల్లో ఏర్పడుతున్న పరిస్థితులపై అధ్యయనం చేసేం దుకు ఒక కమిటీని ఎన్జీటీ నియమించింది.

- ఓఎన్జీసీ సంస్థల కార్యకలాపాలపై అఽధ్యయనానికి రెడీ
- గోదావరి జిల్లాల కలెక్టర్లు, పలువురు పర్యావరణవేత్తలతో కమిటీ
- నవంబరు 17లోగా నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ఆదేశం
- కష్టాలపై ఆధారాలతో ఫిర్యాదు చేయండి : పర్యావరణవేత్త యెనుముల
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
కృష్ణా గోదావరి బేసినలో ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు నిర్వహిస్తున్న కార్యకలాపాల వల్ల తరచూ ప్రమాదాలు ఉత్పన్నం కావడం, పర్యావరణ కాలుష్యం ఏర్పడడం వంటి కారణాలపై నేషనల్ గ్రీన ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పందించింది. ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల కార్యకలాపాల వల్ల గోదావరి జిల్లాల్లో ఏర్పడుతున్న పరిస్థితులపై అధ్యయనం చేసేం దుకు ఒక కమిటీని ఎన్జీటీ నియమించింది. పరిస్థితులపై విచారణ జరిపి నవంబరు 17వ తేదీలోగా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంది. సఖినేటిపల్లి మండలం కేశవదాసు పాలెం వాసి పర్యావరణవేత్త యెనుముల వెంకటపతిరాజు ఇటీవల ఎన్జీటీలో ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాలపై ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరిం చింది. అభియోగాలను అధ్యయనం చేసేం దుకు ఒక కమిటీని నియమించింది. గోదావరి జిల్లాల కలెక్టర్లు, సెంట్రల్ పొల్యూషన బోర్డు కమిటీ సభ్యులు, పర్యావరణానికి సంబంధిం చిన యూనివర్సిటీ కమిటీ సభ్యులు, ఆంధ్రా యూనివర్సిటీలోని పెట్రోలియం విభాగానికి చెందిన ఒక సభ్యుడిని కమిటీలో నియమించింది. ఈ కమిటీ సభ్యులు ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాలు జరిగే ప్రాం తాల్లో పర్యటించి నవంబరు 17వ తేదీలోగా కోర్టుకు నివేదికను సమర్పించాల్సి ఉంది. గోదావరి జిల్లాల్లో ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల కార్యకలాపాల వల్ల బ్లోఅవుట్ లు, గ్యాస్ పైపులైన్లు దగ్ధం, తరచూ పైపులైన్ల లీకేజీ వల్ల పంట పొలాలకు సంభవిస్తున్న నష్టం, జల కాలు ష్యం, గాలిలో గ్యాస్‌ను మండించడం వల్ల ఏర్పడు తున్న పరిస్థితులు ఇలా అనేక కార్యకలాపాల వల్ల గోదావరి జిల్లాల్లో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటోం దని, ప్రజలకు జరుగుతున్న నష్టాలు, సీఎస్ఆర్ నిధుల దుర్వినియోగం మొదలైన పరిస్థితులపై ప్రజలు కమి టీ సభ్యులకు నేరుగా, లేదంటే రిజిస్టర్ పోస్టు ద్వారా, లేదా ఈ-మెయిల్ ద్వారా ఆధారాలతో ఫిర్యాదు చేయా ల్సిందిగా యెనుముల వెంకటపతిరాజు విజ్ఞప్తి చేశారు. కోర్టుకు చేస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని సమాచారాన్ని పీడీఎఫ్ ఫైల్ ద్వారా కమిటీ సభ్యులందరికీ అందేలా ఈ-మెయిల్ చేయడంతోపాటు అందుకు అవసరమైన ఆధారాలను కూడా సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.