ఫ్యాక్టరీలు తెరవడంపై అధికారుల ఫైర్‌

ABN , First Publish Date - 2020-03-25T10:04:43+05:30 IST

మండల పరిధిలోని ఈతకోట, గోపాలపురంలో ఉన్న నెక్కంటి, అవంతి సీఫూడ్స్‌ ఫ్యాక్టరీలో పనులు చేయించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ్యాక్టరీలు తెరవడంపై అధికారుల ఫైర్‌

రావులపాలెం రూరల్‌, మార్చి 24 : మండల పరిధిలోని ఈతకోట, గోపాలపురంలో ఉన్న నెక్కంటి, అవంతి సీఫూడ్స్‌ ఫ్యాక్టరీలో పనులు చేయించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తహసీల్దార్‌ జిలాని, సీఐ వి. కృష్ణ ఆధ్వ ర్యంలో ఫ్యాక్టరీలను మూసివేశారు. రక్షణ చర్యలు పాటిం చకుండా సిబ్బందితో పనులు చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యకలాపాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్‌ ఐలు పి.బుజ్జిబాబు, శాస్ర్తి, ఆర్‌ఐ ఇబ్రి హీం పాల్గొన్నారు.

Read more