అక్రమ వ్యాపారానికి అడ్డుకట్టేది?

ABN , First Publish Date - 2020-12-30T05:40:22+05:30 IST

మోతుగూడెం, డిసెంబరు 29: ఒడిశా రాష్ట్రానికి చెందిన మద్యం యథేచ్ఛగా సీలేరు నదీ మీదుగా ఏపీలోని మోతుగూడెనికి అక్రమ రవాణా జరుగుతోంది. కొన్నిరోజులుగా ఒడిశా నుంచి సీలేరు నదీగుండా పడవలపై మద్యాన్ని తరలిస్తున్నారు. కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా మ

అక్రమ వ్యాపారానికి అడ్డుకట్టేది?
ఒడిశా మద్యాన్ని సీలేరు నదీలో పడవపై తరలిస్తున్న దృశ్యం

సీలేరు నది మీదుగా మోతుగూడెనికి 

ఒడిశా, తెలంగాణ మద్యం

పడవల్లో అక్రమ రవాణా

చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌ అధికారులు

మోతుగూడెం, డిసెంబరు 29: ఒడిశా రాష్ట్రానికి చెందిన మద్యం యథేచ్ఛగా సీలేరు నదీ మీదుగా ఏపీలోని మోతుగూడెనికి అక్రమ రవాణా జరుగుతోంది. కొన్నిరోజులుగా ఒడిశా నుంచి సీలేరు నదీగుండా పడవలపై మద్యాన్ని తరలిస్తున్నారు. కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా మద్యం తరలిస్తూ సొమ్ములు గడిస్తున్నారు. రూ.లక్షల విలువైన ఒడిశా మద్యాన్ని మోతుగూడెం, పొల్లూరు ప్రాంతాల్లో బెల్ట్‌ షాపుల ద్వారా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రం మద్యం కావడంతో మందుబాబులకు అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇదేకాక మరోవైపు తెలంగాణ మద్యం కూడా మోతుగూడెనికి రవాణా అవుతోంది. భద్రాచలం, నెల్లిపాక మీదుగా విలీన మండలాల నుంచి మోతుగూడెం మద్యం తరలివెళ్తోంది. మద్యం వ్యాపారులు డిసెంబరు 31, జనవరి1 వేడుకలను దృష్టిలో ఉంచుకుని దానికి అనుగుణంగా ఇప్పటికే మద్యాన్ని రహస్య ప్రాంతాల్లో భారీగా నిల్వలు పెడుత్ను ట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని నియంత్రించాల్సిన ఎక్సైజ్‌, పోలీ్‌సశాఖ చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెలువడుతు న్నాయి. ఆ శాఖ అధికారులకు ఈ వ్యవహారం తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడంలేదనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఎక్సైజ్‌ ఎస్‌ఐ రవికుమార్‌ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2020-12-30T05:40:22+05:30 IST